సినిమాiBomma website | ఐ బొమ్మ వెబ్​సైట్​పై ఫిర్యాదు

iBomma website | ఐ బొమ్మ వెబ్​సైట్​పై ఫిర్యాదు

ఐ బొమ్మ వెబ్​సైట్​ మళ్లీ ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. వెబ్​సైట్​పై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్​ ప్రతినిధులు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iBomma website | ఐ బొమ్మ వెబ్​సైట్​ మళ్లీ ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. ఆ వెబ్​సైట్​లో కొత్త సినిమాలను అప్​లోడ్​ చేశారు. దీంతో చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్​ (Film Chamber) ప్రతినిధులు సైబర్​ క్రైమ్ (Cyber Crime)​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో ఐ బొమ్మ వెబ్​సైట్​తో తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్​ (Hyderabad) పోలీసులు ఐ బొమ్మ వెబ్​సైట్, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడి చేత ఆ వెబ్​సైట్​ క్లోజ్​ చేయించారు. దీంతో కొన్ని రోజులుగా ఐ బొమ్మ సైట్​ మనుగడలో లేదు. ఇటీవల మళ్లీ వెబ్​సైట్​ ప్రత్యక్షం అయింది.

iBomma website | నాకు సంబంధం లేదు

ఐ బొమ్మ వెబ్​సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అనంతరం అతడు బెయిల్​పై విడుదల అయ్యాడు. దీంతో రవి మళ్లీ వెబ్​సైట్ ఓపెన్​ చేసినట్లు పలువురు భావించారు. అయితే కొత్తగా వచ్చిన ఐ బొమ్మ వెబ్‌సైట్‌తో తనకు సంబంధం లేదని రవి స్పష్టం చేశారు. ఐ బొమ్మ పేరును వాడుకుని కేటుగాళ్లు కొత్తగా వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశారు. ఇటీవల విడుదలైన సినిమాలు అందులో పెట్టారు. దీంతో సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : iBomma Website | టాలీవుడ్​కు షాక్​.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...