Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Working Women Safety | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ “సఖి నివాస్”, వన్ స్టాప్ సెంటర్ “సఖి కేంద్రం”ను మంత్రి సీతక్క (Minister Seethakka) మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు.

ఈ హాస్టల్‌లో సుమారు 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పించామని తెలిపారు. చిన్న పిల్లలతో వచ్చే తల్లులు కూడా ఇక్కడే బస చేసే విధంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళల భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఎదుగుతుంటే కొందరు సహించలేక విమర్శలు చేస్తున్నారని, కానీ మహిళల శక్తి ముందు అలాంటి విమర్శలు నిలవవని అన్నారు.

Working Women Safety | వడ్డీ లేని రుణాలు

రాష్ట్ర ప్రభుత్వం (State Government) మహిళా సంఘాలకు రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచిందని తెలిపారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, మహిళా సూపర్ మార్కెట్లు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు ఖర్చులకోసం కోసం ఇతరులను ఆశ్రయించే స్థితి నుంచి.. ఇంటి ఖర్చులు భరించే స్థాయికి, పిల్లల చదువు బాధ్యతలు చూసుకునే స్థాయికి, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలను తీసుకెళ్తున్నామని వెల్లడించారు. సంపద సృష్టించే శక్తిగా మహిళలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Working Women Safety | సోలార్​ ప్లాంట్లు ప్రారంభిస్తాం

Working Women Safety

మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను బుధవారం ప్రారంభించనున్నామని సీతక్క తెలిపారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) చేతుల మీదుగా ప్రారంభిస్తామని జూన్ 5న మహిళలకు ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Hydraa Demolitions | కోకాపేటలో హైడ్రా కూల్చివేతలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *