FRO Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FRO Caught by ACB | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. టేకు చెట్లు నరకడంతో పాటు రవాణా కోసం అనుమతి ఇవ్వడానికి ఫారెస్ట్ రేంజ్​ అధికారి ఏకంగా రూ.రెండు లక్షల లంచం డిమాండ్​ చేశాడు. అతడిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

FRO Caught by ACB | టేకు చెట్లు నరకడానికి..

జగిత్యాల (Jagtial) జిల్లా కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్​ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 120 టేకు చెట్లను నరికివేయడానికి, రవాణా అనుమతి జారీ చేయడం కోసం ఆయన రూ.2 లక్షల లంచం డిమాండ్​ చేశాడు. అందులో రూ.లక్ష నగదును మే 13న స్వీకరించాడు. అనుమతి ఇచ్చిన తర్వాత తర్వాత మరో రూ.లక్ష ఇవ్వాలని అడిగాడు. ఫిర్యాదుదారుడు బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.80 వేలకు తగ్గించాడు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదుదారుడి నుంచి గురువారం రూ.80 వేల లంచం తీసుకుంటుండగా కరీంనగర్ (Karimnagar) యూనిట్ ఏసీబీ అధికారులు ఎఫ్​ఆర్​వో గులాం మొయనుద్దీన్​ను పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు.

FRO Caught by ACB | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్​ రెండో వారంలో రాష్ట్రంలోకి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *