Harish Rao Counter | రేవంత్‌కు, షాబాద్ హంతకుడికి తేడా లేదు: హరీశ్​రావు

సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Counter | సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో సీఎం మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు.

రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం, బెల్టుతో కొట్టాలి అని మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా ఏమీ లేదనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీచమైన, హింసాత్మకమైన వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

Harish Rao Counter | డైవర్షన్​ డ్రామాలు

ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో.. అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ డ్రామాలు తెరపైకి తేవడం రేవంత్​రెడ్డికి పరిపాటిగా మారిందని హరీశ్​రావు విమర్శించారు. పోక్సో (POCSO) నిందితుడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్లు నమోదు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ మానవ మృగం.. ఆరుగురిని హత్య చేశాడన్నారు.

Harish Rao Counter | హోంశాఖ చేతకానితనం

harish rao

ఆరు హత్యలు చేసిన నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. ఈ శాంతిభద్రతల వైఫల్యం నుండి, ప్రజల తీవ్ర ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే రేవంత్ సర్కార్ మళ్లీ అదే కాళేశ్వరం, మేడిగడ్డ, NDSA పాట పాడుతున్నారని విమర్శించారు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన, తపన రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదని ఈరోజు మీడియా సమావేశంతో తేలిపోయిందన్నారు. నీళ్లు అడిగితే రక్తం చల్లాలన్నా ఈ అహంకారపు, దుర్మార్గపు వైఖరిని తెలంగాణ రైతాంగం గమనిస్తుందన్నారు.

దీనిని కూడా చదవండి : Land Resurvey | భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *