అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HMWSSB | హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాగునీటిని దుర్వినియోగం చేసే వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని అనగనగా హోటల్ తమ ప్రాంగణాన్ని శుభ్రపరిచే క్రమంలో నీటిని వృథా చేసినందుకు అధికారులు రూ.20 వేల జరిమానా వేశారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి (MD Ashok Reddy) బుధవారం జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా, రోడ్ నం.45లోని హోటల్ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేస్తూ వృథా చేయడాన్ని గమనించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటిని ఇలాంటి అవసరాలకు విచక్షణారహితంగా వినియోగించొద్దని స్పష్టం చేశారు. హోటల్‌కు నోటీసు జారీ చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. దీంతో అధికారులు హోటల్ నిర్వాహకురాలు కె. గాయత్రి రెడ్డికి రూ.20,000 జరిమానా విధించి, ఆ మొత్తాన్ని వసూలు చేశారు.
HMWSSB | నీటి వనరులను సంరక్షించాలి
ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటి వనరులను సంరక్షించాలని ఎండీ సూచించారు. ప్రాంగణాలు, రహదారులు, వాహనాలు శుభ్రం చేసేందుకు నీటిని అధికంగా వినియోగించడం సరికాదన్నారు. తాగునీరు సహా నీటి వనరులను దుర్వినియోగం చేస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Adloor Yellareddy | అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతుల ధర్నా.. పలువురి అరెస్ట్