Adloor Yellareddy | అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతుల ధర్నా.. పలువురి అరెస్ట్

రాజ్యాంగబద్ధంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Adloor Yellareddy | రాజ్యాంగబద్ధంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. సదాశివనగర్ (Sadashivanagar) మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ధర్నా (Farmers Protest) చేపట్టారు.

Adloor Yellareddy | ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2004-2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, 2014-2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి సొసైటీ పాలకవర్గాలను నియమించాయన్నారు. ప్రస్తుతం మూడేళ్లుగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా డైరెక్ట్‌గా పదవులు కేటాయిస్తోందని ఆరోపించారు.

Adloor Yellareddy |  ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామని..

ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే నేరుగా సొసైటీ పాలకవర్గాలను నియమిస్తోందని అన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 65 శాతం బీసీలు ఉన్నా సొసైటీ పాలకవర్గంలో ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. రైతులుగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకునే హక్కు తమకు ఉందని, ఖచ్చితంగా ఎన్నికల ప్రకారమే సొసైటీ పాలకవర్గాలను ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ, ఖర్గే అరెస్ట్‌పై మంత్రి పొన్నం ఫైర్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *