Revanth Reddy | మోదీ సింహాసనం దిగి పోవాలి : సీఎం రేవంత్​రెడ్డి

ప్రధాని మోదీ తన సింహాసనాన్ని ఖాళీ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | ప్రధాని మోదీ (PM Modi) తన సింహాసనాన్ని ఖాళీ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. లేదంటే ప్రజలే దించుతారని పేర్కొన్నారు. ఢిల్లీలోని రాజ్​ఘాట్​లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

దేశంలో జనాభా పెరుగుతుంటే… 13 కోట్ల ఓట్లు ఎలా మాయమయ్యాయని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఈ పోరాటం ఒక పార్టీది కాదని, ప్రతి భారతీయుడి ఆత్మగౌరవ పోరాటం అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్​ (CEC) జ్ఞానేష్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మతం, భాష పేరుతో ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ ఇంతకాలం ప్రయత్నించారని ఆరోపించారు. ఈడీ, సీబీఐని ఉపయోగించి నెగ్గేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పుడు 13 కోట్ల ఓట్లు తొలగించారన్నారు.

Revanth Reddy | ఎన్నికల కమిషన్​ను వాడుతోంది

బ్రిటీష్‌ వాళ్లు సైమన్ కమిషన్‌ను వాడితే.. బీజేపీ ఎన్నికల కమిషన్‌ను వాడుతోందని రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. నాడు భగత్ సింగ్.. ఇప్పుడు రాహుల్‌ పోరాడుతున్నారని పేర్కొన్నారు. సీఈసీపై మోదీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్​ఐఆర్​కు వ్యతిరేకంగా కాంగ్రెస్​ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *