అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chicken Prices | శ్రావణ మాసం (Shravan Masam) ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలోకు రూ.300పైగా ఉన్న రేట్లు ప్రస్తుతం దిగి వచ్చాయి.
శ్రావణ మాసం ఈ నెల 13 నుంచి ప్రారంభం అయింది. ఈ నెలను హిందువులు పవిత్రంగా భావిస్తారు. వ్రతాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో చాలా మంది నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఫలితంగా చికెన్, మటన్ విక్రయాలు భారీగా తగ్గాయి. డిమాండ్ లేకపోవడంతో చికెన్ వ్యాపారులను ధరలను తగ్గించారు.
Chicken Prices | రూ.220కి కిలో..
పది రోజుల క్రితం వరకు తెలంగాణలో చికెన్ ధరలు (Chicken Raes) వినియోగదారులకు చుక్కలకు చూపించాయి. కిలో రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయించారు. మటన్ రేట్లు సైతం రూ.800 నుంచి రూ.1000 వరకు ఉండటంతో మాంసం కొనాలంటేనే ప్రజలు ఆలోచించారు. అయితే తాజాగా చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో రూ.220-240లకు విక్రయిస్తున్నారు. దీంతో మాంసంప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
శ్రావణ మాసం కావడంతో గిరాకీ లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చుంటున్నామని పేర్కొంటున్నారు. డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గించి అమ్ముతున్నట్లు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Divyastra Mk3 | దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం