అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sarpanch caught in ACB trap | ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులే కొందరు అడ్డదారి తొక్కుతూ, ప్రజల సొమ్మును దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అందినకాడికి దండుకుంటున్న లంచావారుల బాగోతాలు తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చాయి.
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచి ధారావత్ వీరు ఏకంగా గ్రానైట్ వ్యాపారుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
Sarpanch caught in ACB trap | రూ. 13 కోట్లకు బేరం..
గ్రామాభివృద్ధిని గాలికొదిలేసిన సర్పంచులు, లంచాల రూపంలో లక్షలు నొక్కేయడమే ధ్యేయంగా మారుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. మోదుగడ్డ తండా పరిధిలోని క్వారీ కార్యకలాపాలు, గ్రానైట్ వ్యాపారం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయేందుకు సర్పంచి ధారావత్ వీరు ఏకంగా రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఆ తర్వాత దానిని రూ. 13 లక్షలకు కుదుర్చుకున్నాడు.
ఇందులో భాగంగా ఖమ్మంలోని ఫిర్యాదుదారుడి కార్యాలయంలో మొదటి విడతగా రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) నగదు తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, నిందితుడిని వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Sarpanch caught in ACB trap | రాజకీయాల్లో పెచ్చుమీరుతున్న అవినీతి..
ప్రజాస్వామ్యంలో గ్రామాలకు ప్రథమ పౌరులుగా ఉండాల్సిన సర్పంచులు మొదలుకొని పెద్ద స్థాయి నాయకుల వరకు కొందరు అవినీతి ఊబిలో కూరుకుపోవడం వ్యవస్థకే పెను శాపంగా మారుతోంది. ప్రజలు ఎంతో నమ్మి గెలిపిస్తే.. ఆ పదవిని ప్రజలకు సేవ చేయడానికి కాకుండా.. అక్రమ సంపాదనకు అడ్డాలుగా మార్చుకోవడం దారుణం. గ్రానైట్ క్వారీలపై పడి కప్పం కట్టించుకోవాలనే ఆలోచనలు చేస్తున్న ఇలాంటి అవినీతి నాయకుల పుట్టణాలను అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Sarpanch caught in ACB trap | అవినీతిని ఎదిరిద్దాం..
ఇలాంటి అవినీతిపరులకు చట్టపరంగా తగిన శాక్ష్యాలతో బుద్ధి చెబితేనే రాజకీయాల్లో ప్రక్షాళన సాధ్యమవుతుంది. ప్రజాధనాన్ని దోచుకునే ఏ ఒక్క ప్రజాప్రతినిధిని, అధికారినైనా వదిలిపెట్టకూడదు.
వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి లంచావతారాలను కట్టడి చేయడంలో ప్రజల పాత్ర కూడా కీలకం. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రజాప్రతినిధి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలి.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏసీబీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా సమస్య ఎదురైతే.. టాల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106, సోషల్ మీడియా ఎక్స్ (Twitter), ఫేస్బుక్లో (@Telangana ACB) సంప్రదించవచ్చని సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..