Limbadri Gutta | ఎదుర్కోలులో ఉప్పొంగిన భక్తిపారవశ్యం.. లింబాద్రిగుట్టపై కనులపండువగా బ్రహ్మోత్సవం

శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఎదుర్కోలు వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Gutta | లింబాద్రిగుట్టపై పెళ్లి సందడి నెలకొంది. శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి(Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఎదుర్కోలు వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Limbadri Gutta | స్వామివారు పెళ్లికొడుకుగా..

స్వామివారు పెళ్లికొడుకుగా ముస్తాబై గుర్రపు సేవపై ఊరేగింపుగా తరలిరాగా.. అమ్మవారు పల్లకిలో ఎదురుగా చేరడంతో గుట్టపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. బుక్కా, గులాలు చల్లుకుంటూ భక్తులు ఉత్సవంలో భాగస్వాములయ్యారు. కల్యాణ వేడుకలో భాగంగా తొలుత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని స్వర్ణాభరణాలు, పుష్పమాలికలతో అలంకరించి గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం గుర్రపు సేవపై కొలువుదీర్చి మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి పురవీధుల మీదుగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు. మరోవైపు లక్ష్మీ అమ్మవారిని పల్లకిలో స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. ఇరువురి ఎదుర్కోలు సందర్భంగా అర్చకులు, వారి కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా బుక్కా, గులాలు చల్లుకుంటూ వేడుకను నిర్వహించారు.

Limbadri Gutta | పాటలు.. నృత్యాలతో సందడి..

స్వామివారి ఊరేగింపు సాగినంతసేపు భక్తుల కోలాహలం కనిపించింది. పల్లకి ముందు భక్తులు చేసిన నృత్యాలు, భజనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఆనందం ఆనందం ఆయెనే.. మా లింబన్న పెళ్లికొడుకాయెనే..’ అంటూ ఆలపించిన పాటలు, ‘గోవింద నీ నామమెంతో రుచిరా..’ అంటూ చేసిన కీర్తనలు గుట్టపై మార్మోగాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భీమ్​గల్​ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణానికి ముందు నిర్వహించిన ఎదుర్కోలు ఘట్టం భక్తుల్లో ఆనందోత్సాహాలను నింపింది.

2 233 876

ఇది కూడా చదవండి: EV వెహికల్స్ కొంటున్నారా..? ఇవి మస్ట్ గా చెక్ చేయండి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *