అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cheyutha Pension Benefits | అర్హులైన లబ్ధిదారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం జుక్కల్(Jukkal), బిచ్కుంద, మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు చేయూత పింఛన్లను అందజేశారు.
Cheyutha Pension Benefits | గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోందన్నారు. చేయూత పింఛన్లతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను సైతం అందజేశామని ఆయన తెలిపారు. గత పాలకులు కొత్తరేషన్ కార్డులు ఇవ్వకుండా.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ఆశలు కల్పించి పేదలను నిరాశపర్చారన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మధ్యతరగతి జీవితంపై విరక్తి..వడ్డీలు కట్టలేక దంపతుల ఆత్మహత్య