Cheyutha Pension Scheme | బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్​ లక్ష్యం

బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్​ లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cheyutha Pension Scheme | బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్​ లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలో లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.

Cheyutha Pension Scheme | అర్హులైన లబ్ధిదారులకు చేయూత..

ఈ సందర్భంగా ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వితంతువులు, పేద, బడుగుబలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. ఈ పింఛన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందడమే కాకుండా వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్, డీసీసీ ఉపాధ్యక్షుడు మంచిర్యాల విద్యాసాగర్, మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రయ్య దశరథ్, కాంగ్రెస్ నాయకులు ప్యాలాల రాములు, శంకర్, వసీం, శివానంద్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సాగర్ నీళ్లపైనా ఏపీ దుర్మార్గం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *