Yellareddy Constituency Development | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మదన్​ మోహన్​రావు

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి చేస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Constituency Development | నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎల్లారెడ్డి(Yellareddy) ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పాలనాధికారితో ఆశిష్ సంగ్వాన్‌తో సమావేశం నిర్వహించారు.

Yellareddy Constituency Development | నియోజకవర్గంలోని సమస్యలపై..

నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో విత్తన ఉత్పత్తి క్షేత్రం సమీపంలో వివాదంలో ఉన్న భూములను రీసర్వే చేసి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఎక్కపల్లి, సజ్జనపల్లి గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లోని భూములకు సైతం సర్వే నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విద్యార్థులు, యువత చదువుకునేందుకు వీలుగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Yellareddy Constituency Development | బతుకమ్మ ఘాట్లు.. గ్రామాలకు రహదారులు

చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్లు నిర్మించాలని, రహదారులు లేని గ్రామాలకు బీటీ, సీసీ రోడ్లు మంజూరు చేసి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని అధికారులను కోరారు.

మహిళా సంఘాల భవనాలకు స్థలాల కేటాయింపు, రైతుల భూ సమస్యలు, పట్టాదార్ పాస్‌బుక్‌ల జారీ, నకిలీ విత్తనాల నియంత్రణ, పేదలకు ఇంటి స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైతులకు మొక్కజొన్న, జొన్న కొనుగోలు పరిమితుల పెంపు, ఖాళీ రేషన్ షాప్ డీలర్ పోస్టుల భర్తీ, కొత్త మీ-సేవ కేంద్రాల ఏర్పాటు సహా మొత్తం 13 అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *