Balkonda Gambling Raid | పేకాటస్థావరంపై పోలీసుల దాడి.. పలువురి అరెస్ట్​..

బాల్కొండ ఊర చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Balkonda Gambling Raid | బాల్కొండ (balkonda) ఊర చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్సై యాసిర్ అరాఫత్​ వివరాలు వెల్లడించారు.

Balkonda Gambling Raid | ఊర చెరువు సమీపంలో..

మండంలోని ఊరచెరువు సమీపంలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ జూదం ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు గుర్తించారు. అనంతరం వారివద్ద నుంచి రూ.7,880 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఐదు బైక్​లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాటకు దూరంగా ఉండాలని, ఎవరైనా పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లుగా తెలిస్తే సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: హెల్మెట్ లోనే ఎయిర్ బ్యాగ్… 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *