అక్షరటుడే, భీమ్గల్: Nimbachala Brahmotsavams | మండలంలోని (Bheemgal) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాచల క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వైదిక సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేపట్టారు.
Nimbachala Brahmotsavams | ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని..
ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ తొలుత స్వామివారి గర్భాలయంలో విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి పుణ్యహవచనం, రక్షాబంధనం, శ్రీమద్భగవద్గీత పారాయణం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పుట్టమన్ను సేకరించి ద్వాదశ పాత్రల్లో బీజాలను నాటారు. బీజాలు మొలకెత్తే ప్రక్రియతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా, స్వామివారి కృపతో సకల శుభాలు కలగాలని ప్రార్థించినట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి కుటుంబ సభ్యులు, అర్చక బృందం పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: TGSRTC Special Buses | కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు..