అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: TGSRTC Special Buses | కార్తీక మాసం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర
నిజామాబాద్ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ డిపో-2 మేనేజర్ వివరాలు వెల్లడించారు.
TGSRTC Special Buses | నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో..
టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు యాత్రను ఏర్పాటు చేయటం జరిగిందని మేనేజర్ తెలిపారు. ఈ ప్రత్యేక యాత్రలో భాగంగా రేచింతల్ సిద్ధి వినాయక, బీదర్ లక్ష్మి నరసింహ స్వామి, గానుగాపూర్ ధత్తాత్రేయ మందిరం, పండరీపుర్ విఠలేశ్వర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉందన్నారు.
ఈ యాత్ర ఈనెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుండి బయలుదేరి 22వ తేదీ ఉదయం 6 గంటలకు తిరిగి నిజామాబాద్ (Nizamabad) చేరుకుంటుందని తెలిపారు.
ఈ యాత్రకు పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,875 టికెట్ ధరగా నిర్ణయించటం జరిగిందన్నారు.కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు టికెట్ రిజర్వేషన్ కోసం నిజామాబాద్–2 డిపో అసిస్టెంట్ మేనేజర్ (ఫోన్: 7396594436) లేదా , భాస్కర్ (9866649129) ను సంప్రదించగలరని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Insurance Scheme | 19వ తేదీ నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి