అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay Revanth | తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘జెన్-జీ’ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. యువతకు అవకాశాలు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలని ఆయన సూచించారు.
Bandi Sanjay Revanth | రాహుల్ ప్రధాని అయే వరకు ఎందుకు..?
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన బండి సంజయ్, తెలంగాణలోనే వెంటనే ఒక ‘జెన్-జీ’ ప్రతినిధిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు.
అమెరికా దాడులకు విరామం.. మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిత్రదేశాలపై ప్రతీకార దాడులు నిలిపివేసిన ఇరాన్
Bandi Sanjay Revanth | ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించాలి..
అంతేకాకుండా, ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, విద్యాశాఖతో పాటు మున్సిపల్ శాఖలను యువతకు చెందిన ప్రజాప్రతినిధులకు అప్పగించాలని ఆయన సూచించారు. యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి నిజంగా ఉంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
యువత సాధికారతపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేదని బండి సంజయ్ విమర్శించారు. యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితమవుతుందని ఆయన పేర్కొన్నారు.