అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Tata Madhu Resignation | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Tata Madhu Resignation | అట్రాసిటీ కేసు పెట్టాలి
బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)పై ఎమ్మెల్సీ తాతా మధు ఉద్దేశ్యపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉందని ఆరోపించారు. కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్, ఈఆర్వో కోఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, టౌన్ డీసీసీ ఉపాధ్యక్షుడు సలీం, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్, గంగాధర్, మెంబర్ బొబ్బిలి మురళి, సకినాల శివ ప్రసాద్, జిల్లెల రమేష్, అమరాజు, సాయి బసవ, వహీద్, అపర్ణ, ఆకుల శ్రీశైలం, మల్లేష్ యాదవ్, బండారు రమేష్, మహమ్మద్ సముద్దీన్, సయ్యద్ అర్షద్, షేక్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Crop Damage | వరిపంట నష్టపోయేలా విషపూరిత రసాయనాల పిచికారి.. పోలీసులకు ఫిర్యాదు