Alumni Meet Bodhan | ఆత్మీయ పలకరింపులు.. గత జ్ఞాపకాల పున:స్మరణాలు.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Alumni Meet Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్ (bodhan) పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College bodhan) 1996–99 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం(College Reunion) నిర్వహించారు. పట్టణంలోని శర్బతి కెనాల్​ వద్ద గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్​లో ఈ కార్యక్రమం జరిగింది.

Alumni Meet Bodhan | పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ..

చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆనాటి కళాశాల అనుభవాలను నెమరు వేసుకున్నారు.

ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఆయా రంగాలకు సంబంధించిన విషయాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా రోజంతా ఆనందంగా గడిపారు.

మరోసారి అందరూ తప్పకుండా కలుసుకోవాలని తీర్మానించుకుని వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుభాష్​, గౌతం, సాయిరెడ్డి, జగదీష్​, నర్సింలు, శ్రీనివాస్​రెడ్డి, మంగ్రాం, శిరీష, మమత, సంధ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Ghost SIM Operation | ఘోస్ట్ సిమ్‌ల గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *