Chandrapur Tiger Capture | బోనులో చిక్కిన పెద్దపులి.. ఐదు గ్రామాల ప్రజలకు ఊరట

నెల రోజులుగా కొనసాగిన ఈ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో T-122 పులి బోనులో చిక్కింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrapur Tiger Capture | మహారాష్ట్ర Maharastra లోని చంద్రాపూర్‌ జిల్లా సావళి అటవీ ప్రాంతంలో గత నెల రోజులుగా ప్రజలను భయాందోళనలకు గురిచేసిన పెద్దపులిని ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు బంధించారు. ముగ్గురు పశువుల కాపరుల ప్రాణాలు తీసిన ఆరేళ్ల T-122 పులి బోనులో చిక్కడంతో పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. సావళి అటవీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఈ పులి సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించింది. పశువుల కాపరులపై దాడులు చేసి ముగ్గురి ప్రాణాలు తీసినట్లు సమాచారం. దీంతో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Chandrapur Tiger Capture | నెల రోజులుగా ప్రత్యేక ఆపరేషన్​

సెప్టెంబర్‌ 27 నుంచి పులిని బంధించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించారు. పులి కదలికలను గుర్తిస్తూ, దానిని బంధించేందుకు పలు చర్యలు చేపట్టారు. నెల రోజులుగా కొనసాగిన ఈ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో T-122 పులి బోనులో చిక్కింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

పులిని అటవీ శాఖ అధికారులు బంధించడంతో సావళి అటవీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. పులి సంచారంతో ఇన్నాళ్లూ ఆందోళనకు గురైన గ్రామస్థులు ఇప్పుడు ఉపశమనం పొందారు. బంధించిన పులిని తదుపరి ఎక్కడికి తరలించాలనే అంశంపై అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *