అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: World Polio Day | భారత్‌ను పోలియో రహితంగా (Pulse Polio Vaccination) తీర్చిదిద్దేంటుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐఎంఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ (Dr Visha) పేర్కొన్నారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా నగరంలోని (Nizamabad) ఖలీల్‌వాడి చంద్రశీల పిల్లల ఆస్పత్రిలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి హరీష్ స్వామితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
World Polio Day | ఐదేళ్ల పిల్లలందరికీ వేయించాలి..
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. పోలియో చుక్కలు (Oral Polio Vaccine – OPV) అనేవి పోలియోమైలిటిస్ (Polio) అనే ప్రాణాంతక వైరస్ వ్యాధి నుంచి పిల్లలను రక్షించడానికి నోటి ద్వారా వేసే ఒక రకమైన టీకా అని పేర్కొన్నారు.
భారత్‌ను పోలియో రహిత దేశంగా మార్చాలని, పిల్లల భద్రత కోసం ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్‌పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్యులు దీపక్ రాథోడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అబద్దాలు ఆడడానికి సిగ్గు అనిపిస్తలేదా?- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి