GPO Bribery Case | రూ.22 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జీపీవో

లంచం తీసుకుంటూ గ్రామ పాలన అధికారి రెడ్​ హ్యాండెడ్​గా ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : GPO Bribery Case | మంచిర్యాల జిల్లా మోసం గ్రామ పాలన అధికారి (GPO) డి శ్రీనివాస్​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి భూ రికార్డులు సరి చేస్తానని ఆయన రూ.22 వేల లంచం డిమాండ్​ చేశాడు.

మోసం జీపీవోగా శ్రీనివాస్​ పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తండ్రి పేరును రెవెన్యూ రికార్డుల్లో సరి చేయడం, వ్యవసాయ భూమిని వారసత్వంగా పొందేందుకు వీలు కల్పిస్తానని లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి గురువారం రూ.22 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ (ACB) అధికారులు జీపీవో శ్రీనివాస్​ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేశారు.

GPO Bribery Case | జోరుగా అవినీతి

తెలంగాణలో గతంలో వీఆర్​వో (VROO) వ్యవస్థ ఉండేది. అయితే చాలా మంది వీఆర్​వోలు భారీగా లంచాలు తీసుకొని గ్రామాల్లో వందలాది మంది రైతుల రికార్డులను తారుమారు చేశారు. పైసలు ఇస్తేనే వీఆర్వోలు పని చేసే పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం వీఆర్​వో వ్యవస్థను రద్దు చేసింది. దీంతో గ్రామస్థాయిలో అవీనితికి కొంత అడ్డుకట్ట పడింది. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. వీఆర్​వో వ్యవస్థ స్థానంలో జీపీవోలను తీసుకొచ్చింది. గతంలో వీఆర్​వో, వీఆర్​ఏలుగా పని చేసిన వారిని జీపీవోలుగా నియమించింది. దీంతో వీరిలో కొందరు మళ్లీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పై అధికారుల దగ్గర పనులు చేయిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Bus Theft | సినీ ఫక్కీలో ఛేజింగ్.. అర కిలోమీటరు పరిగెత్తి దొంగను పట్టుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *