KCR Meeting | 27న బీఆర్​ఎస్​ ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR Meeting | బీఆర్ఎస్​ (BRS) అధినేత కేసీఆర్ జగిత్యాలలో సోమవారం నిర్వహించిన సభతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ నెలకొంది. చాలా రోజుల తర్వాత గులాబీ బాస్​ బహిరంగ సభలో మాట్లాడటంతో కేడర్​లో ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 27న తెలంగాణ భవన్ (Telangana Bhavan)​లో కేసీఆర్​ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) ఈ నెల27న ఘనంగా నిర్వహించనున్నారు. గతేడాది రజోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి తెలంగాణ భవన్​లో వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం కేసీఆర్​ పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదితర రాజకీయ అంశాల మీద చర్చించనున్నారు.

KCR Meeting | వీరికి ఆహ్వానం

కేసీఆర్ (KCR)​ మీటింగ్​కు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లకు ఆహ్వానం అందింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. కాగా రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్​ వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

kcr meeting 2

దీనిని కూడా చదవండి : RDO Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్డీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *