Hyderabad Home Stays | హైద‌రాబాద్‌లో కపుల్స్‌కు స్పెషల్‌గా హోమ్ స్టేస్.. రోజు రోజుకి మారుతున్న ట్రెండ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hyderabad Home Stays | హైదరాబాద్ (Hyderabad) నగరంలో లైఫ్‌స్టైల్ ట్రెండ్స్ వేగంగా మారుతున్నాయి. ప్రత్యేకంగా యువత, కపుల్స్, చిన్న గెట్‌ టు గెదర్స్ కోసం కొత్త కాన్సెప్ట్‌లు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండాపూర్‌లో తాజాగా ప్రారంభమైన 1BHK ప్రైవేట్ పెంట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెంట్‌హౌస్‌ను పూర్తిగా స‌రికొత్త స్టైల్‌లో డిజైన్ చేసి, అందంగా అలంకరించారు.

ఇందులో ఏర్పాటు చేసిన కానోపీ సెటప్ కపుల్స్‌కు రొమాంటిక్ అంబియెన్స్‌ను అందిస్తోంది. చిన్న గెట్‌టుగెదర్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్, స్పెషల్ మూమెంట్స్ కోసం ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది. ప్రైవసీ కోరుకునే వారికి ఈ పెంట్‌హౌస్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. హోటల్ రూమ్స్ లేదా రెస్టారెంట్స్‌తో పోలిస్తే, ఇక్కడ మరింత కంఫర్ట్‌తో పాటు ప్రైవేట్ స్పేస్ లభిస్తుంది. అందుకే ఈ తరహా ప్రైవేట్ స్పేస్‌లకు నగరంలో డిమాండ్ పెరుగుతోంది.

Hyderabad Home Stays | గిరాకీ ఎక్కువే..

లోకేషన్ పరంగా కూడా ఈ పెంట్‌హౌస్ అనుకూలంగా ఉంది. ఈ హోమ్ స్టేస్ ఇంటీరియర్ డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మోడ్రన్ లుక్‌తో పాటు కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని రూపొందించారు. చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లేదా ఫ్రెండ్స్‌తో క్వాలిటీ టైమ్ గడపాలనుకునే వారికి ఇది సరైన వేదికగా నిలుస్తోంది. హోమ్ స్టేస్ అంటే కేవలం ఉండడానికి గది మాత్రమే కాదు ఒక అనుభూతి. వ్యక్తిగత గోప్యత, కంఫర్ట్, హోమ్ ఫీలింగ్ ఉండటంతో చాలా మంది ఈ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్‌గా ఎదిగిన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ (Kondapur) వంటి ప్రాంతాల్లో ఈ హోమ్ స్టేస్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

Hyderabad Home Stays | పనుల నిమిత్తం వచ్చేవారు

నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు, ట్రావెలర్స్ మాత్రమే కాకుండా, స్థానికంగా ఉన్న యువత కూడా వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. మోడ్రన్ ఇంటీరియర్స్, థీమ్ బేస్డ్ సెటప్స్, రూఫ్‌టాప్ స్పేస్‌లు, కానోపీ సెటప్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు వీటిలో కనిపిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ పెంట్‌హౌస్‌లు అయితే ప్రత్యేకంగా కపుల్స్ కోసం డిజైన్ చేయబడుతున్నాయి.హోటళ్లతో (Hotels) పోలిస్తే హోమ్ స్టేస్‌లలో ఎక్కువ ప్రైవసీ ఉండటం ప్రధాన కారణంగా చెప్పాలి. అంతేకాకుండా, కొంతమంది తమ సొంత ప్రాపర్టీలను హోమ్ స్టేస్‌లుగా మార్చి అదనపు ఆదాయం పొందుతున్నారు. దీంతో ఇది ఒక కొత్త బిజినెస్ మోడల్‌గా కూడా ఎదుగుతోంది.

Hyderabad Home Stays | వీడియోలు వైరల్

సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ ట్రెండ్ పెరగడానికి కారణమైంది. అందమైన ఇంటీరియర్స్, ప్రత్యేక సెటప్స్‌తో ఉన్న హోమ్ స్టేస్‌ల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో మరింత మంది ఆకర్షితులవుతున్నారు. అయితే, ఈ ట్రెండ్ Trend పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, నిబంధనలు, అనుమతుల విషయంలో కూడా స్పష్టత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన రిజిస్ట్రేషన్, భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

hyd

దీనిని కూడా చదవండి : Wealth management mistakes | సంపాదన కోట్లలో ఉన్నా.. ఈ జాగ్రత్తలు లేకపోతే కష్టం బూడిదలో పోసిన పన్నీరే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *