Borabanda Car Accident | బోరబండలో కారు బీభత్సం..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Borabanda Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని బోరబండలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. ఓ బాలుడు అతివేగంగా కారు నడపడంతో.. నియంత్రణ కోల్పోయి పలు బైక్​లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యయి.

మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో 17 ఏళ్ల బాలుడు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా దూసుకొచ్చి బైక్​పై వెళ్తున్న ఇద్దరు సోదరులను ఢీకొట్టాడు. అంతేగాకుండా అదే వేగంలో మరో 7 బైకులను సైతం ఢీకొట్టడంతో అవి ఎరిగి పడ్డాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది.

Borabanda Car Accident | అద్దె కారుతో..

ప్రమాదంలో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ బాలుడు అద్దె కారును తీసుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : KTR Rahul Letter | ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల దుమారం.. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *