Kamareddy Dussehra Celebrations | కామారెడ్డిలో లేజర్ షో, రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి..

కామారెడ్డిలో దసరా ఉత్సవ సమితి, షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Dussehra Celebrations | కామారెడ్డిలో (kamareddy) దసరా ఉత్సవ సమితి, షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.  ఐదేళ్ల విరామం తర్వాత పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Kamareddy Dussehra Celebrations | ఇందిరాగాంధీ స్టేడియంలో..

మూడు రోజులుగా ఇందిరాగాంధీ స్టేడియంలో పనులు కొనసాగుతున్నాయి. స్టేడియంలో మైదానాన్ని చదును చేశారు. స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రస్తుతం ఒకే దారి ఉండగా గేటుకు అవతలి వైపు, ఇవతలి వైపు ప్రత్యేకంగా మరో రెండు దారులు ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. అలాగే రావణ దహనం కోసం రావణుని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. క్రాకర్స్​తో రావణ దహనం చేసేందుకు పెద్దఎత్తున క్రాకర్స్ తీసుకొచ్చారు. దాంతో రావణుని వైపు ఎవరు వెళ్లకుండా కటౌట్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు.

Kamareddy Dussehra Celebrations | ప్రత్యేకాకర్షణగా లేజర్​షో..

అలాగే స్టేడియం ప్రధాన రహదారిని కేవలం వీఐపీలు, అధికారుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన దారుల నుంచి వాహనాలు, ప్రజలు ప్రధాన గేటు వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టం కోసం ప్రత్యేకంగా డీజే సెటప్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక వేదికను ముస్తాబు చేశారు. ఈసారి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో నిర్వహించనున్నారు. రావణ దహనానికి ముందు లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఇతర నాయకులు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ముఖ్యమైన నాయకులు, అధికారులు పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. వాహనాల పార్కింగ్ కోసం డెయిరీ కళాశాల, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రాంతం, కళాభారతి, డిగ్రీ కళాశాల మైదానాలను కేటాయించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

445

68897

ఇది కూడా చదవండి: A Special Dasara Message from Our Anchor! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *