RDO Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్డీవో

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RDO Caught by ACB | నారాయణపేట (Narayanpet) రెవెన్యూ డివిజన్ అధికారి పత్లావత్​ రామచందర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బర్త్​ సర్టిఫికెట్​ కోసం లంచం అడగ్గా అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ఓ వ్యక్తి తన స్నేహితుల జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. బర్త్​ సర్టిఫికెట్ (Birth Certificate) ఆలస్య నమోదుకు సంబంధించిన ఫైలు ఆమోదం కోసం ఆర్డీవో పత్లావత్​ రామచందర్​ రూ.25 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమచారం అందించాడు. ఈ మేరకు మంగళవారం ఆర్డీవో లంచం తీసుకుంటుంగా.. మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

RDO Caught by ACB

 RDO Caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: TGPSC PCB Jobs | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *