Vishwak Sen Cult trailer | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ట్రైలర్.. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో వస్తున్న ఇండియాస్ ఫస్ట్ ‘స్లాషర్’ ఫిల్మ్!

స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి అంశాలను సరికొత్త కోణంలో టచ్ చేస్తూ రూపొందించిన ఈ ‘కల్ట్’ థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vishwak Sen Cult trailer | టాలీవుడ్‌ Tollywood లో వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ జానర్స్‌తో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘#CULT’ ట్రైలర్ తాజాగా విడుదలై ఇండస్ట్రీలో విపరీతమైన అంచనాలను పెంచేసింది.

ఇండియాలోనే తొలిసారిగా వస్తున్న ‘స్లాషర్’ (Slasher) ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా ప్రేమికులను పిచ్చెక్కిస్తోంది. స్టైలిష్ విజువల్స్, ఊరమాస్ యాక్షన్, బ్రూటల్ వైలెన్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

Vishwak Sen Cult trailer | విశ్వక్ సేన్ మార్క్ డైరెక్షన్ & యాక్షన్

ఇప్పటివరకు మన సినిమాల్లో చూడని సరికొత్త సస్పెన్స్, క్రైమ్, వైలెంట్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటేనే ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ కలుగుతోంది.

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్‌ కాన్వాయ్‌పై కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం!

హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా మరో ట్రెండ్‌సెట్టర్‌ను ఇవ్వడానికి విశ్వక్ సేన్ సిద్ధమైనట్లు ట్రైలర్‌లోని ప్రతీ ఫ్రేమ్ స్పష్టం చేస్తోంది. ఆయన స్టైలిష్ లుక్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

Vishwak Sen Cult trailer | రవి బస్రూర్ మ్యూజిక్

‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కి ప్రాణం పోసింది. ప్రతి షాట్‌లోనూ ఆయన మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

సందీప్ కకారాల నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవి తేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ విజువల్స్ పరంగా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి అంశాలను సరికొత్త కోణంలో టచ్ చేస్తూ రూపొందించిన ఈ ‘కల్ట్’ థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *