అక్షరటుడే నిజామాబాద్ సిటీ: District Jail Bathukamma | రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జిల్లా కేంద్ర కారాగారంలో (Nizamabad District Jail) ఆదివారం జైళ్లశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. కేంద్ర కారాగారంలోని మహిళా ముద్దాయిలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
District Jail Bathukamma | తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం..
తెలంగాణ సాంస్కృతిక సారథి బృందానికి చెందిన కళాకారులు సవిత, మీనా కలిసి బతుకమ్మ గేయాలను లయబద్ధంగా ఆలపిస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, ఆటలపై మహిళా ముద్దాయిలకు అవగాహన కల్పించారు.
కళాకారుల గేయాలతో కారాగార ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను కారాగారంలో నిర్వహించడం ద్వారా మహిళల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు అవకాశం కలిగిందని జిల్లా జైలు సూపరింటెండెంట్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ వేడుకల నిర్వహణకు తోడ్పాటును అందించిన కళాకారులు సవిత, మీనాను ఈ సందర్భంగా సత్కరించారు.
ఇది కూడా చదవండి: నేను ‘చెక్క’గా మారిపోతున్నాను – నా అన్వేషణ అన్వేష్