అక్షరటుడే, కామారెడ్డి: Bathukamma Immersion | కామారెడ్డి (Kamareddy) పెద్దచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. చెరువుకు వెళ్లేదారిలో లైట్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు.
Bathukamma Immersion | అసహనం వ్యక్తం చేస్తూ..
సద్దుల బతుకమ్మ నిమజ్జనం కోసం రాత్రి వేలాదిగా మహిళలు చెరువు వద్దకు చేరుకుంటుండగా.. నిమజ్జనం జరిగే ప్రధాన ప్రాంతంలో కనీసం లైట్లు లేకపోవడంతో మహిళలు ఫోన్ లైట్స్ వెలుతురులో నిమజ్జనానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఫొటోలు దిగే చోటనే లైట్లు ఏర్పాటు చేశారని, నిజంగా మహిళలు నిమజ్జనం చేసే దారిలో, చెరువు వద్ద చీకటే రాజ్యమేలిందని ప్రజలు మండిపడ్డారు.
Bathukamma Immersion | బతుకమ్మలు ఓ చేతితో.. మరో చేతితో ఫోన్ టార్చ్‌లైట్..
బతుకమ్మలు పట్టుకుని నడుస్తున్న మహిళలు, చిన్న పిల్లలు ఫోన్ టార్చ్ లైట్లతో దారి చూసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. పెద్దఎత్తున జరిగే బతుకమ్మ నిమజ్జనం కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు.. కేవలం ప్రచారం కోసమే లైట్లు పెట్టారని, భద్రత, వెలుతురు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో జారుడుగా ఉన్న ప్రాంతంలో నిమజ్జనం చేయడం ప్రమాదకరంగా మారిందని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం