Telangana Armed Struggle | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Telangana Armed Struggle | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్​ అన్నారు. నగరంలోని సీపీఐ జిల్లాశాఖ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు.

Telangana Armed Struggle | 17న బహిరంగ సభను సక్సెస్​ చేయాలి..

సుధాకర్​ మాట్లాడుతూ.. ఈనెల 17న నాంపల్లి గ్రౌండ్స్​లో జరిగే సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలను స్మరిస్తూ ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17న హైదరాబాద్‌ (Hyderabad)లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా జరుపుతున్నప్పటికీ ఈ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రెస్​మీట్​లో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై.ఓమయ్య, సీపీఐ జిల్లా నాయకులు పి.హన్మాండ్లు, ప్రసాద్, గోవర్ధన్, రాధా కుమార్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bhukakpalli Hanuman Temple | భూకాన్​పల్లి హనుమాన్ ఆలయాభివృద్ధికి మంత్రి శంకుస్థాపన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *