Brindavanam Colony Bathukamma | బృందావనం కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Brindavanam Colony Bathukamma | తెలంగాణ Telangana సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఉన్న బృందావనం కాలనీలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు వేడుకల్లో సంబరంగా పాల్గొని సందడి చేశారు.

Brindavanam Colony Bathukamma | పండుగ శోభ..

రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, ఆటపాటలతో కాలనీ అంతటా పండుగ శోభను నింపారు. బతుకమ్మ బతుకమ్మా కోల్​.. నీ బిడ్డ ఇంటికాడా కోల్​ .. చిత్తూ చిత్తూల గుమ్మ శివునీ ముద్దూల గుమ్మ.. అంటూ బతుకమ్మ పాటలు, కోలాటాలు, మహిళల సందడి మధ్య ఆత్మీయత, ఆనందం వెల్లివిరిశాయి. సద్దుల బతుకమ్మ సంబరాలతో కాలనీ సంబరంగా మారింది.

Thar Car Accident | థార్​ కారు బీభత్సం.. అక్కాతమ్ముళ్ల మృతి

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *