అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thar Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మహీంద్రా థార్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
విజయవాడ జాతీయ రహదారిపై (Vijayawada Highway) హయత్ నగర్ సమీపంలో అతివేగంతో వచ్చిన ‘మహీంద్రా థార్’ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, రేఖ అనే ఇద్దరు అక్కాతమ్ముళ్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రేఖ నాలుగేళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడటంతో, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Thar Car Accident | పండుగ కోసం వెళ్తుండగా..
రంగారెడ్డి (Rangareddy) జిల్లా పెద్దఅంబర్‌పేటకు చెందిన వీరు.. పండుగ కోసం ఎల్బీ నగర్ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా ప్రమాదానికి కారణమైన ‘థార్’ వాహనం ఒక పోలీసు అధికారికి చెందినదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల థార్ కార్లతో కొందరు హంగామా చేస్తున్నారు. అతివేగంగా వాటిని నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో థార్ కార్లతో రేసింగ్ చేస్తూ ఓ బైక్‌ను ఢీకొట్టడంతో మహిళ చనిపోయిన విషయం తెలిసిందే.
దీనిని కూడా చదవండి : MVSR College Incident | ఎంవీఎస్ఆర్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన