Prashant Kishor | నితీష్​కుమార్​పై ప్రశాంత్ కిషోర్​ ప్రశంసలు

నితీష్​కుమార్​పై జన సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Prashant Kishor | బీహార్‌ (Bihar)లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్​కుమార్​పై జన సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్​ ప్రశంసల వర్షం కురిపించారు.

వైశాలిలో ప్రచారం సందర్శంగా మాట్లాడుతూ.. నితీష్​ కుమార్ బీహార్‌లోని అత్యంత వివేకవంతులైన నాయకులలో ఒకరని కొనియాడారు. సమాజం పట్ల ఆయనకు నిజమైన శ్రద్ధ ఉందని, రాష్ట్ర చరిత్రలోని టాప్ 10 నాయకులలో ఆయన ఖచ్చితంగా ఉంటారన్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్న సమయంలో.. ఇతరులు రాజకీయం చేశారని చెప్పారు. ఆ సమయంలో రాష్ట్రంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

Prashant Kishor | నితీష్​తో సన్నిహితంగా..

ప్రశాంత్​ కిషోర్​ గతంలో జేడీయూ (JDU) ఉపాధ్యక్షుడిగా పని చేశారు. నితీష్​ కుమార్​తో సన్నిహితంగా ఉన్నారు. అనంతరం ఆయన పార్టీలో నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను ఆయన బరిలో నిలిపారు. నితీష్​కుమార్​ను ప్రశంసించడం ద్వారా ఆయన మద్దతుదారుల ఓట్లను పొందాలని ప్రశాంత్​ కిషోర్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన సీఎం సామ్రాట్​ చౌదరిపై విమర్శలు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : MVSR College Incident | ఎంవీఎస్​ఆర్​ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *