MVSR College Incident | ఎంవీఎస్​ఆర్​ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

ఎంవీఎస్​ఆర్​ కాలేజీలో విద్యార్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MVSR College Incident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి దండియా (Dhandiya) కార్యక్రమం జరుగుతుండగా లైటింగ్ నిర్మాణం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సోనా అనే విద్యార్థి మృతి చెందగా.. 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఆదివారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలేజీలో ఆందోళన చేపట్టారు.

ఎస్​ఎఫ్​ఐ (SFI) ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ గేటు ఎదుట నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చేటప్పుడు ప్రభుత్వం, పోలీసులు భద్రతను ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించారు. మల్లారెడ్డి కళాశాల, ప్రీతిరెడ్డి, శ్రీలీల వంటి వారి ప్రదర్శనలు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు ప్రధానంగా డబ్బు సంపాదించడం కోసమే సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.

MVSR College Incident | యాజమాన్యంపై కేసు నమోదు

ఆదిబట్ల పోలీసులు (Adibatla police) కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, భద్రతా చర్యలు తీసుకున్నారో లేదో అని వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ.. బలమైన గాలుల వల్ల లైటింగ్​ స్టాండ్​ కూలిపోయిందన్నారు.

దీనిని కూడా చదవండి : NHM Employees | ఎన్​హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *