NHM Employees | ఎన్​హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం : కవిత

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ జీవో తేవడం అన్యాయమని కల్వకుంట్ల కవిత అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NHM Employees | నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో తేవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఎన్​హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది ఎన్​హెచ్ఎం ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించారని కవిత అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, రేట్లు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ సమయంలో జీతాలు పెంచి ఉద్యోగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. కోతలు విధించడం సరికాదన్నారు. కొందరి వేతనాలు, పెంచి మరికొందరివి తగ్గించారన్నారు.

NHM Employees | సమయానికి ఇవ్వకపోవడంతో..

వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల (NHM Employees ) శ్రమను దోచుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి వేతనాలు పెంచాలని డిమాండ్​ చేశారు. అంతేగాకుండా వారిని రెగ్యులరైజ్​ చేయాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఎన్​హెచ్ఎం ఉద్యోగులు ఒక్క రోజు పని మానేస్తే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దెబ్బ తింటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.

దీనిని కూడా చదవండి : Nizamabad Gambling Raid | పోలీసులకు చుక్కలు చూపించిన జూదరులు..తొమ్మిది మంది అరెస్టు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *