Kukatpally Fire Accident | కూకట్​పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్​ నగరంలోని కూకట్​పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpally Fire Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కూకట్​పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పేదలకు చెందిన పలు గుడిసెలు కాలిపోయాయి.

కూకట్​పల్లిలోని హరిజన సేవా సంఘం కాలనీలో గురువారం రాత్రి దోమల నివారణ కోసం పొగ పెట్టారు. దీంతో మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న గుడిసెలు, కట్టెల డిపోకు మంటలు అంటుకున్నాయి. దీంతో అవి కాలిబూడిదయ్యాయి.

Kukatpally Fire Accident | ఇద్దరికి గాయాలు

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. గుడిసెలు కాలిపోవడంతో పేదలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. మరోవైపు టింబర్​ డిపో అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఇది కూడా చదవండి..: Hyderabad Eye Emergency | 108 అంబులెన్స్‌లోనే కంటి ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌! దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *