అక్షరటుడే: బోధన్ : Bodhan Document Writers | బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Bodhan Document Writers | ఇబ్బందులను గురిచేస్తున్నారని..
బోధన్ (Bodhan) సబ్ రిజిస్ట్రార్ సాయినాథ్ ప్రజలను, డాక్యుమెంట్ రైటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రతి డాక్యుమెంట్‌కు ఏదో ఒక మెలిక పెట్టి పక్కకు పెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి సర్వే నెంబర్ కూడా 22ఏలో ఉందని బూచి చూపిస్తూ.. రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ రైటర్స్ ధర్నాతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి..: PDS Rice Scam | పేదల బియ్యానికి ‘పాలిష్’ దందా.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా..!