Welfare Schemes | సంక్షేమమే ధ్యేయంగా ముందుకు : మంత్రి పొన్నం ప్రభాకర్​

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Welfare Schemes | రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) అన్నారు. అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

బంజారాహిల్స్​లోని బంజారా భవన్​లో ఖైరతాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్​ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం 4.68 లక్షల పెన్షన్లు కొత్తగా మంజూరు చేసిందన్నారు.

Welfare Schemes | అందరికి రేషన్​ కార్డులు

తాము అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేశామని పొన్నం పేర్కొన్నారు. కొత్త రేషన్​ కార్డులు ఇచ్చామన్నారు. కొత్తగా అర్హులు ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకుంటే రేషన్​ కార్డు అందిస్తామని తెలిపారు. హైదరాబాదులో ఇందిరమ్మ టవర్స్ కట్టి అర్హులకు ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao | పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *