అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి (Narsingi) ప్రాంతంలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో నివసిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు.
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఒక టవర్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం అవి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో 5 నుంచి 14వ అంతస్తులు ప్రభావితమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Hyderabad Fire Accident | తప్పిన ప్రాణనష్టం
అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదంలో ఫాల్ సీలింగ్ పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Rajagopal Reddy | రాజగోపాల్ రెడ్డి విషయం పరిశీలిస్తున్నాం : పీసీసీ చీఫ్