అక్షరటుడే వెబ్‌డెస్క్: Amit Shah Rahul Gandhi | ఓట్ల తొలగింపుపై ‘ఇండియా’ కూటమి పార్టీలు ఆందోళనలు చేస్తుంటే, ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన కోసం రూ.8,941 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah Rahul Gandhi | నా మాట వినండి..
రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. “మీరు ఇప్పుడు విదేశాల్లో ఎక్కడో ఉన్నారు, నా మాటలు మీకు వినిపించవులే. మీరు ఢిల్లీకి ( Delhi )వచ్చాక నా మాటలు శ్రద్ధగా వినండి. రాబోయే 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. ప్రతి ఆరు నెలలకోసారి విదేశాలకు వెళ్లే వ్యక్తిలా కాకుండా, తాను ఈ దేశంలోనే పుట్టానని, ఇక్కడే జీవిస్తున్నానని, చివరికి ఇక్కడే ప్రాణాలు విడుస్తానని ఎద్దేవా చేశారు.
Amit Shah Rahul Gandhi | ఘాటు స్పందన..
ఎలక్టోరల్ రోల్స్ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పాత్రపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్, మిత్రపక్షాలు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ అమిత్ షా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో 54 ఏళ్లుగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 12 ఏళ్లుగా, ఢిల్లీలో 18 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉందని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని తాను చెబితే, ఓట్లలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఇది కూడా చదవండి: El Nino Preparedness | విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి