అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anitha Radhakrishnan Arrest 1 | మాజీ మంత్రి, డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ అరెస్టు నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ పరిణామంపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్, డీఎంకే రాజకీయ సంస్కృతిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Anitha Radhakrishnan Arrest | సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
Anitha Radhakrishnan Arrest 1 అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారంటూ..
అనితా రాధాకృష్ణన్ అత్యంత అహంకారపూరితంగా, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని తమిళిసై ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే సమయంలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం డీఎంకే నాయకత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు.
సామాజిక వేదికలైనా, సోషల్ మీడియా అయినా డీఎంకే నేతలు ప్రత్యర్థులను విమర్శించేందుకు అనుచిత, అసభ్య, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని ఆమె అన్నారు. ఇదే డీఎంకే రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని పేర్కొంటూ, అలాంటి ధోరణిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Anitha Radhakrishnan Arrest 1 | హుందాతనం ఉండాలని హితవు
రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రత్యర్థులను విమర్శించే సమయంలో హుందాతనం, సంయమనం పాటించాలని తమిళిసై సూచించారు. వ్యక్తిగత దూషణలకు బదులుగా అంశాలపై రాజకీయ చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
అనితా రాధాకృష్ణన్ అరెస్టు, దానిపై బీజేపీ–డీఎంకే నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.