Kangana Ranaut Rahul Gandhi | “బ్రో.. కాస్త ఆగు..  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సెటైర్!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kangana Ranaut Rahul Gandhi | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. నటి కృతి సనన్ నటించిన ఓ రక్షా బంధన్ ( Raksha Bandhan )యాడ్ వివాదంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తనదైన శైలిలో స్పందించారు. పితృస్వామ్యాన్ని కూల్చివేయాలంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా బదులిచ్చారు.

Kangana Ranaut Rahul Gandhi | కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు..

మహిళల హక్కులు, ప్రాతినిధ్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కంగన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్ చేశారు. మహిళల రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, షాబానో కేసు వంటి పలు కీలక చారిత్రక అంశాల్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఆమె ఎత్తిచూపారు.

‘‘బ్రో.. కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై.. ఇక మీరు చెప్పాల్సింది మొదలుపెట్టండి’’ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. మహిళల గురించి మాట్లాడే ముందు దేశమాతను గౌరవించాలని ఆమె పరోక్షంగా చురకలంటించారు. రక్షా బంధన్ ప్రకటనతో ప్రారంభమైన ఈ వివాదం ప్రస్తుతం బాలీవుడ్ నుంచి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి:  Indian Stock Market | ఫ్లాట్‌గా సూచీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *