Supreme Court Teacher Recruitment | అర్హత లేని వారికి టీచర్ పోస్టులా?.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశంలో ఉపాధ్యాయుల నియామకాలు, సర్దుబాటు ప్రక్రియపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Supreme Court Teacher Recruitment | దేశంలో ఉపాధ్యాయుల నియామకాలు, సర్దుబాటు ప్రక్రియపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలల్లో సరైన అర్హతలు లేని వ్యక్తులను టీచర్లు లేదా ట్యూటర్లుగా నియమించడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (  Surya Kant ), జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విద్యా హక్కు చట్టం (RTE Act), ఎన్సీటీఈ (NCTE), యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం నిర్దేశిత కనీస అర్హతలు, టెట్ (TET), నెట్ (NET) లాంటి అర్హత పరీక్షలు పాస్ కానివారిని ఏ విద్యా సంస్థలోనూ ఉపాధ్యాయులుగా నియమించడానికి వీలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Supreme Court Teacher Recruitment |విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం..

విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. విద్యార్థులకు బోధించేందుకు అనర్హులను ఎందుకు నియమిస్తున్నారని కేంద్రాన్ని, రాష్ట్రాలను ప్రశ్నించింది. ఇది భావి తరాల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సరైన అర్హతలు, పారదర్శకమైన పోటీ పరీక్షల విధానం లేకుండా వెనుకదారులు పట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి, ఇతర సబ్సిడరీ వ్యవస్థల్లోకి ఉపాధ్యాయులను తీసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-A ప్రకారం నాణ్యమైన విద్య ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని కోర్టు గుర్తుచేసింది. ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపడితే దేశ విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో అన్ని విద్యా నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగానే జరగాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి:  Glass Wall Systems IPO | మార్కెట్‌లోకి మరో చిన్న ఐపీవో.. జీఎంపీ ఎంతంటే?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *