DMK Exits INDI Alliance | ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DMK Exits INDI Alliance | దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండి కూటమి నుంచి మరో పార్టీ వైదొలిగింది. కీలకమైన డీఎంకే (DMK) కాంగ్రెస్​ కూటమికి గుడ్​బై చెప్పింది.

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. టీవీకే (TVK) పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించగా మెజారిటీ 10 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంబన నెలకొంది. అయితే డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్​ అనుహ్యంగా టీవీకేకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ 5 స్థానాల్లో గెలుపొందింది. కూటమిలో చర్చించకుండా ఏకపక్షంగా టీవీకేకు మద్దతు ప్రకటించడంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఇండి కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

DMK Exits INDI Alliance | స్పీకర్​కు లేఖ

పార్లమెంటులో సీట్ల కేటాయింపులో మార్పులు కోరుతూ DMK నాయకురాలు కనిమొళి (Kanimozhi) స్పీకర్‌కు లేఖ రాశారు. DMK ఇకపై కాంగ్రెస్‌తో కలిసి కూర్చోదని ఆమె పేర్కొన్నారు. DMKకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో సీట్ల కేటాయింపు విధానంలో మార్పులు చేయాలని కోరుతూ కనిమొళి స్పీకర్‌కు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, భారత జాతీయ కాంగ్రెస్‌తో తమ కూటమి ముగిసిపోయిందని ఆమె ప్రకటించారు.

DMK Exits INDI Alliance | అఖిలేష్​ పోస్ట్​ వైరల్

సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ అధికారాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ, ఎం.కె. స్టాలిన్‌లతో తాను ఉన్న చిత్రాలను శుక్రవారం ఉదయం పోస్ట్​ చేశారు. “కష్టకాలంలో ఒకరినొకరు వదిలేసే రకం నేను కాదు,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్​ను ఉద్దేశించి ఆయన పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో టీవీకే అత్యధిక స్థానాలు గెలవగానే కాంగ్రెస్​ డీఎంకేను వీడి ఆ పార్టీకి మద్దతు తెలిపింది.

DMK Exits INDI Alliance | కూటమి పని ఖతం

ఇండి కూటమిలో కాంగ్రెస్​ పెద్ద పార్టీ కాగా పలు ప్రాంతీయ పార్టీలు కొనసాగుతున్నాయి. గతంలో నుంచి తృణమూల్​ కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీ ఆ కూటమి నుంచి దూరంగా ఉంటున్నాయి. సమాజ్​వాది పార్టీ, డీఎంకే మాత్రం ఆది నుంచి ఇండి అలియెన్స్​లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా డీఎంకే సైతం కూటమి నుంచి వైదొలగడంతో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం శివసేన (ఉద్ధవ్​ థాక్రే), ఎన్​సీపీ (శరద్​ పవార్​), ఆర్​జేడీ, జేఎంఎం తదితర పార్టీలు ఉన్నాయి.

దీనిని కూడా చదవండి : TVK Government Formation| గవర్నర్ వైఖరిపై అసహనం.. కోర్టు మెట్లెక్కనున్న విజయ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *