Nepal Workers Caution | నేపాల్ పని మనుషులతో జాగ్రత్త.. సీపీ సజ్జనార్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Workers Caution | నేపాల్​ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ (CP Sajjanar) సూచించారు. వారిని పనిలో పెట్టుకోవద్దన్నారు.

నగరంలోని జూబ్లీహిల్స్​లో రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి వినయ్​ రంజన్​ రే భార్య తనూజ రే హత్యకు గురైన విషయం తెలిసిందే. వారింట్లో పని చేసే నేపాల్​కు చెందిన మహిళ మరో ముగ్గురితో కలిసి ఆమెను హత్య చేసింది. అనంతరం నగదు, నగలతో పరారు అయ్యారు. ఈ ఘటనపై సజ్జనార్​ మాట్లాడుతూ.. తాము వద్దని చెబుతున్నా ఇంకా వాళ్ళనే పనిలో కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

Nepal Workers Caution | ఏడాది క్రితం పనిలో..

నేపాల్ (Nepal)​కు చెందిన సదరు మహిళ ఏడాది క్రితం రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి ఇంట్లో పనికి కుదిరినట్లు సీపీ తెలిపారు. ఇటీవల నేపాల్​ గ్యాంగ్​లు దోపిడీలకు పాల్పడుతున్నాయని ఆయన చెప్పారు. వారిని పనిలో పెట్టుకోవద్దని సూచించారు. చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వారు చోరీ చేస్తారన్నారు. గతంలో నగరంలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయన్నారు. అయితే తాజా ఘటనలో నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరాడక తనూజ మృతి చెందినట్లు తెలిపారు. బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సహకారంతో హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

Nepal Workers Caution | అవకాశం కోసం చూస్తారు

ప్రజలు అప్రమత్తం కావాలి అని రెండు నెలల నుంచి చెబుతున్నామని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. నేపాలీలను పనిలో పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వారు ఎవరు ఎమిటని చూడరన్నారు. అవకాశం రాగానే ఇళ్లు దోచేస్తారని చెప్పారు. దేశంలోని అనేక నగరాల్లో నేపాలీ గ్యాంగ్​లు దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడించారు.

Nepal Workers Caution | కొన్ని దేశాల్లో బ్యాన్

నేపాలీలపై గల్ఫ్​లోని కొన్ని దేశాల్లో బ్యాన్ ఉంది. ఆ తర్వాత వారు ఇండియాలో ఉద్యోగాల కోసం వచ్చి స్థిర పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​ (Hyderabad)లో ఇటీవల నేపాలీలు ఎక్కువయ్యారు. ఒకప్పుడు గుర్కాలుగా మాత్రమే చేసే వీరు ఇప్పుడు అంతటా విస్తరించారు. ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో, ఇళ్లలోపని వారిగా చేరుతున్నారు. ఇటీవల వీరు చేసే నేరాలు సైతం పెరిగాయి.

ఇది కూడా చదవండి..: Retired IPS Wife Murder | రిటైర్డ్​ ఐపీఎస్​ భార్య హత్య

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *