Retired IPS Wife Murder | రిటైర్డ్​ ఐపీఎస్​ భార్య హత్య

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Retired IPS Wife Murder | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసే పని మనిషి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Retired IPS Wife Murder | పరారీలో నిందితుడు

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లోని తమ నివాసంలో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడైన పనిమనిషి పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Secunderabad Love Murder | ప్రేమ వ్యవహారం.. బీటెక్​ విద్యార్థి దారుణ హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *