Asaduddin Owaisi | మా మతం.. మా ఇష్టం.. ఎంపీ అసదుద్దీన్​ సంచలన వ్యాఖ్యలు

హిజాబ్​పై ఇటీవల అలహాబాద్​ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ ఖండించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్​ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. మా మతం.. మేమే నిర్ణయిస్తామన్నారు. ఇస్లాంకు ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించేది న్యాయమూర్తులు కాదన్నారు.

ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల హైకోర్టు (Allahabad High Court)లో పిటిషన్​ దాఖలు చేశారు. విద్యాసంస్థలు నిర్దేశించిన దుస్తుల నియమావళిని వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే హక్కు ఏ విద్యార్థికీ లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇస్లాంలో హిజాబ్​ తప్పనిసరి కాదని పేర్కొంది. కోర్టు తీర్పుపై ఒవైసీ తాజాగా స్పందించారు. ఈ తీర్పును ఇస్లాంపై దాడిగా ఆయన అభివర్ణించారు.

Asaduddin Owaisi | బాలికల విద్యకు ఆటంకం

ఒవైసీ మాట్లాడుతూ.. శబరిమలకు సంబంధించిన తప్పనిసరి మతపరమైన ఆచారాల విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే విచారిస్తోందని ఒవైసీ అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని విచారిస్తున్నప్పుడు, అలహాబాద్ న్యాయమూర్తులు దీనిపై తీర్పు ఇచ్చి ఉండకూడదని పేర్కొన్నారు. తలపాగా ధరించడం అనేది ఆమె ఇష్టం, గోప్యతకు సంబంధించిన విషయమన్నారు. ఈ తీర్పు బాలికల విద్యకు ఆటంకం కలిగిస్తుందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి..: Kangana Ranaut Rahul Gandhi | “బ్రో.. కాస్త ఆగు..  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సెటైర్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *