Noida Family Deaths | మ్యాగి​ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Noida Family Deaths | గ్రేటర్ నోయిడాలో ఒక కుటుంబం ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. రాత్రి మ్యాగి తిన్న తర్వాత ఐదుగురు చనిపోయారు. దీంతో ఫుడ్​ పాయిజన్​తో వారు చనిపోయారని మొదట భావించారు. అయితే నూడిల్స్​లో విషం కలపడంతో వారు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నోయిడాలో మహేష్ (37), అతని భార్య లలిత (35), వారి కుమార్తె మిష్టి (7), కుమారులు లడ్డు (11), సాక్షాత్ (3) శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగలా శ్రీ పదం గ్రామంలోని తమ ఇంట్లో విగతజీవులై కనిపించారు. శుక్రవారం సాయంత్రం సంతకు వెళ్లి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన వారు.. మ్యాగి తిని పడుకున్నారు. అయితే మహేష్ నూడుల్స్‌లో విషం కలిపి ఉంటాడని పోలీసులు పేర్కొన్నాయి.

Noida Family Deaths | ఆస్తి వివాదాలతో..

మహేష్​కు తన కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఆస్తుల పంపకం విషయంలో తన సోదరిమణులతో వివాదం ఉంది. దీంతో ఆయన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మహేశ్​ ఫోన్​లో ఓ ఆడియో లభ్యమైంది. అతను తన మరణానికి తన ఇద్దరు సోదరీమణులు, బావ కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్ సోదరీమణులను, బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

దీనిని కూడా చదవండి : France Protests | ఫ్రాన్స్​లో అల్లర్లు.. దుకాణాల లూటీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *