అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Drinking Water Wastage | ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తీవ్రం కానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నీటి వృథా చేయొద్దని జలమండలి (HMWSSB) అధికారులు కోరుతున్నారు. అయినా కొంతమంది పట్టించుకోవడం లేదు. అలాంటి వారికి అధికారులు జరిమానా వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45లో ఫోర్ ఫాదర్స్ పబ్ (Fore Fathers Pub)లో నీటిని వృథా చేస్తున్నట్లు ఆదివారం అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, పబ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. సదరు పబ్‌కు నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు.
Drinking Water Wastage | పొదుపుగా వాడుకోవాలి
వేసవిలో నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉంది. దీంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయొద్దని పేర్కొంది. ఎవరైనా నీరు వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎవరైనా తాగునీటి వృథా చేస్తున్నట్లు గమనిస్తే జలమండలికి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
దీనిని కూడా చదవండి : Noida Family Deaths | మ్యాగి తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్